- ----------------------------------------------------------
- 03-06-2009 :: 4 pm
- మార్కెట్ నాడి
నేడు మన మార్కెట్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఫ్లాట్ గా ముగిసినా , నేడు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యింది. నేడు సెన్సెక్స్ 14902 పాయింట్లకు ఆరంభించి అతి దుర్భేద్యనమైన 14930 పాయింట్ల అవరోధాన్ని దాటి , ఒక దశ లో ఎనిమిది నెలల గరిష్ట స్థాయికి, అంటే 15046 పాయింట్ల వరకు చేరుకుంది. కాని భాల్లూకాలకి ప్రధాన మైన ఆయుధం 14930 పాయింట్ల అవరోధాన్ని అంత తేలికగా కొట్టిపరేయ లేమని బుల్ల్స్ కి తెలియరావటం తో మార్కెట్ల లో బుల్ల్స్ హవా తగ్గింది. నేటి ట్రేడింగ్ మధ్య లో సెన్సెక్స్ ప్రాఫిట్ బూకింగ్ నకు లోనయ్యి 14733 పాయింట్ల వరకు చేరుకుంది. ఇది మేము ఉదయం చర్చించ మద్దత్తు స్థాయి కి అతి సమీపం అని గుర్తించాలి. ఇక్కడి నుంచి మార్కెట్లు మరల కొంత పుంజుకొని ,చివరకు ఫ్లాట్ గా ముగిసాయి. నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ కేవలం నాలుగు పాయింట్లు కోల్పోయి 14871 వద్ద ముగియగా , nifty 5 పాయింట్లు లాభ పడి 4531 పాయింట్ల వద్ద ముగిసింది.
నేటి మార్కెట్లో FMCG అధికంగా 4.19 % , కన్సుమేర్ డ్యురబుల్ 4.04 % లాభాలను ఆర్జించాయి. కాగా బ్యాంకింగ్ రంగం అధికం గా 1.29 , ఐ. టి. 1 % నష్టాలను నమోడుచేసాయి.
నేటి మార్కెట్ లో మిడ్ క్యాప్ స్టాకులు 1.5 % లాభ పడగా, స్మాల్ క్యాప్ స్టాకులు 2.11 % లాభాలను గడించాయి.
స్టాకులు వారిగా పరిశీలిస్తే నేడు టెక్ మహీంద్రా, వేల్స్పున్ గుజరాత్, అబన్ ఆఫ్షోర్, సుజ్లోన్ అధికంగా 17 ~ 14 % వృద్ధిని నమోదు చేయటం విశేషం. కాగా జైన్ ఇర్రిగాషన్ అత్యధికంగా 5.85% నష్టపోయింది. జైన్ ఇర్రిగాషన్ గురించి నేడు ఉదయమే " సలహా" పేజి లో ఎగ్జిట్ అంటూ పిలుపు నివ్వటం గమనార్హం.
...
- ...