• 04-06-2009 :: 4 pm
  • మార్కెట్ రిపోర్ట్
నేడు మార్కెట్లు మేము సూచించి నట్లు నడుచుకున్నాయి అనటం లో అతిశయోక్తి లేదు. బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నడుమ మన మార్కెట్లు కూడా నష్టాలలో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ నేడు మేము సూచించిన మద్దత్తు స్థాయి ఐన 14756 పాయింట్ల వద్ద ప్రారంభం కావటం విశేషం. ఐతే ఈ మద్దతు కోల్పోవటం తో సెన్సెక్స్ సుమారు 150 పాయింట్ల నష్టం చవిచూసి కనిష్టం గా 14599 పాయింట్ల వరకు చేరుకుంది.
ఐతే, నేడు మన రాష్ట్ర పతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు parliament సంయుక్త సభలో చేసిన ప్రసంగం మార్కెట్లో కొంత ఊపిరి నింపాయి. వారు ప్రసంగం లో ప్రభుత్వ రంగం లో సంస్కరణలు చేపట్టనున్నాటు చేసిన ప్రకటన, ఆర్ధిక రంగాన్ని ఉద్దీపన చేయనున్నట్లు , అందుకు గాను పెన్షన్ రంగం లో మార్పులు, ఎగుమతులకు చేయూత వంటి అంశాలు ప్రసంగించటం తో మార్కెట్ల లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కారణంగా మార్కెట్ చివరలో ఊహించిన షార్ట్ కవెరింగ్ ఏకంగా మార్కేట్లని లాభాల బాట లో మార్చింది. దీని తో సెన్సెక్స్ 138 పాయింట్లు లాభ పడి 15008.68 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 42 పాయింట్లు లాభ పడి 4573 వద్ద ముగిసింది.
నేడు మే 23 నకు సంబంధించిన ద్రవ్యోల్బణ గాణాంకాలు విడుదల అయ్యాయి. ఇది 0.48 % గా నమోదయ్యింది. గత వారం వార్షిక పెరుగుదల 0.61 % గా వుండింది. ఈ అంశం కూడా మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది.
నేడు మిడ్ క్యాప్ రంగం 2.26 % లాభ పడగ, స్మాల్ క్యాప్ 2.20 % లాభాలను ఆర్జించింది. నేడు రియాల్టి రంగం అత్యధికం గా 3.29 % , క్యాపిటల్ గూడ్స్ రంగం 3.23 % లాభాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచాయి. కాగా నేడు మెటల్స్ రంగం భారి గా 2.11 % నష్టపోయింది. నేడు sterlite 5.91 %, nalco 3.93 % నష్టాలను చవిచూసాయి. JP HYDRO నేడు భారిగా 20.64 %, SUZLON 8.19 % లాభాలను ఆర్జించిన సెన్సెక్స్ స్టాకులు.
  • .......