01-06-2009 :: 8 am

మార్కెట్ నాడి

నేడు ఆసియా మార్కెట్లు ఒడిదుడుకుల తో పయనం సాగిస్తున్నాయి. గతం ముగింపు లో అమెరికా మార్కెట్లు కూడా, ఇదే రీతి ఒడిదుడుకులకు లోను కావటం, అమెరికా డాలర్ కొంత బలహీన పడటం,అందుకు గాను బంగారం ధర పెరగటం వంటివి మార్కెట్ల లో చోటుచేసుకుంటున్నాయి. వీటి ప్రభావం వలనమన మార్కెట్లు కూడా , నేడు కొంత ఒడిదుడుకుల కు లోనుకావచ్చు. అమెరికా డాలర్ మరింత బలహీన పడితే, నేడు . టి రంగం కి చెంది వాటాలు కొంత పురోగమించే అవకాశాలున్నాయి. అదే విధం గా నూతన మంత్రులు చేసే ప్రటనల వలన ఆయా రంగాల షేర్లలో చలనం కనిపించ వచ్చు. మదుపరులు వీటి పైన కూడా ద్రుష్టి పెట్టాలి.

సెన్సెక్స్ నకు 14930 పాయింట్ల వద్ద తీవ్ర అవరోధం ఉంది. దీనిని అధిగమించటం మార్కెట్లకు పరిక్షే ! నేడు .టి. , బ్యాంకింగ్ రంగాల స్టాకులు పై ద్రుష్టి సారించవచ్చు. వీటి సహాయం వలన మార్కెట్లు 14757 వరకు చేరే అవకాశం ఉంది. తరువాత ఒడిదుడుకులకు లోనుకావచ్చు. అమెరికా ఆటో దిగ్గజం జెనెరల్ మోటార్స్ నేడు దివాలా ప్రకటించ నున్నది. వార్తని మార్కెట్లు డిస్కౌంట్ చేసే అవకాశం ఉంది కనుక నేడు మార్కెట్లు ఒడిదుడుకులతో పయనం సాగించ వచ్చు.

నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :

గత ముగింపు: 14625

కీలక అవరోధాలు : 14686--14757-14888

కీలక మద్దతులు : 14534-14240-14004

..................