31-05-2009
- మార్కెట్ ముందు చూపు
(జూన్ 1 నుండి జూన్ 5 వరకు )
- 12 వారాల విజయ పరంపరను ఈ వారం కూడా మార్కెట్లు కొనసాగించే ప్రయత్నం చేయనున్నాయి. ఐతే ఈ వారం మార్కెట్లకి అతి భీకరమైన అవరోధాలు ప్రతిబంధకం గా నిలువనున్నాయి. భల్లూకాలు అదను కోసం వేచి వుంటాయని ఒక్క ముక్క లో ఓ ఈ వారం మార్కెట్ల స్వభావం వర్ణించవచ్చు.
- మార్కెట్లు తమ జైత్ర యాత్ర ని ఈ వారం కూడా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రా బోయే బడ్జెట్ పై మార్కెట్ల ముందస్తు అంచనాలు , కొత్త మంత్రి వర్గం మార్కెట్ల కి అనుకూలమైన ప్రకటనలు చేయటం వంటి అంశాలు ఈ వారం కూడా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపే అవకాశం ఉంది.
- ఈ వారం మొదటి భాగం సెన్సెక్స్ ప్రస్థానానికి అతి కీలకం అని చెప్పవచ్చు. సెన్సెక్స్ కి 14930 పాయింట్ల వద్ద అతి భీకరమైన అవరోధం ఉంది. దీనిని దాటాలంటే, సెన్సెక్స్ శ్రమ పడవలసినదే !. ఐతే నూతన మంత్రులు ప్రకటించే సంస్కరణల విధానం, ఉద్దీపన ప్యాకేజీలు మున్నగు అంశాలు తోడ్పడితే మార్కెట్లు ఈ అవరోధాన్ని చెదించ వచ్చు. ఇప్పటికే మార్కెట్లు ఈ అవరోదానికి చేరువలో ఉన్నందున, ఈ దుడుకుడు లో నే ఈ అవరోధం చేదిం చటం ముఖ్యం. రా బోయే రెండు రోజులలో ఈ అవరోధం చేదించ లేక పొతే , మార్కెట్ల లో స్వల్ప ప్రాఫిట్ బూకింగ్ జరిగే అవకాశం ఉంది. ఇదే జరిగితే మార్కెట్లు కొంత స్థిరత్వం కలిగే దిశగా , 14880-14630 పాయింట్ల కి ఇటు అటు గా పయనం సాగిస్తుంది.
- 14930 వరోధాన్ని అతి క్రమిస్తే , సెన్సెక్స్ ఈ వారం లో 15340 పాయింట్ల వరకు ఎగబాకే అవకాశం ఉంది. టెక్నికల్ గా కూడా చార్ట్లు బలం గా ఉన్నాయి కనుక మార్కెట్లు ఈ వారం కూడా ముందుకు సాగే అవాకాశాలు చాలా ఉన్నాయి. మరీ దుర్వార్తలు వినవస్తే తప్ప మార్కెట్లు ఎట్టి పరిస్థితిలో 14003 కంటే తక్కువ గా పడిపోయి, నష్ట పోయే అవకాశాలు లేవు.
- ....................