ఎన్నికల విశ్లేషణ - మార్కెట్ పై ప్రభావం
ఎన్నికల ఫలితాలు మార్కేట్లని ఆనందం లో ముంచెత్తనున్నాయి. ఇప్పటివరకు హంగ్ పార్లమెంటు వచ్చినా వామ పక్షాలు లేకుండా ప్రభుత్వం ఏర్పదనున్నాడని మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా అనుకోవడం జరిగింది. హంగ్ పార్లమెంటు తధ్యం అని మార్కేట్లు భావించాయి. ఐతే ఎగ్జిట్ పోల్స్ లోని ఫలితాల కంటే కూడా ఎన్నికల ఫలితాలు అనుకూలం గా రావటం , UPA మెజారిటీ దాదాపు గా సాధించటం , తద్వారా స్థిర మైన ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం కలగటం వంటి శుభ పరిణామాల కు మార్కేట్లు సానికూలం గా స్పందిన్చనున్నాయి. ఈ సారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కి, వాస్తవ ఫలితాలకి వ్యత్యాసం ఎందుకు కలగనున్నదో మా TELUGUSTOCKMARKET.COM నేటి ఉదయం కౌంటింగ్ ప్రారంభానికి ముందే విశ్లేషణ మీ ముందు ఉంచింది.
మార్కెట్లపై ఈ శుభపరిణామం , ఎ రంగాలపై కలగనున్నదో తెలుసుకునేందుకై " మార్కెట్ ఫోకస్" పేజి ని చూడగలరు.
....