16-05-2009
8 :: 00 am
నేడు ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ఆధారం గా మన మార్కెట్లు లెఫ్ట్ పార్టీలు సహాయం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే అవకాశం upa/ nda కి ఉన్నందున సంబరాలు చేసుకున్నాయి. ఐతే ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు నిజమౌతాయి ? ఈ విషయం మనకు మరికొంత సేపట్లో తెలిసివస్తుంది. కాని ఎగ్జిట్ పోల్స్ తప్పు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కారణం , ఈ సారి నియోజకవర్గాల పునర్వ్యవస్థ, వర్గీకరణ జన సాంద్రం ఆధారంగా ప్రప్రథమంగా జరిగింది. అంటే పునర్వర్గీకరణ జరిగిన నియోజక వర్గాలపై ఎగ్జిట్ పోల్ జరిపిన విశ్లేషకులకు గతం లో ని గణాంకాలు వారివద్ద లభ్యం గా లేవు. ఐతే ఏమిటి ? ఎగ్జిట్ పోల్ లో గతం లోని అనుభవాలకు కూడా WEIGHTAGE ఇవ్వవలసి ఉంటంది. మరి కొత్తగా ఏర్పడిన నియోజక వర్గాల గతి ఏమిటి ? వాటి తాలూకు గతం లోని గణాంకాలను ఎగ్జిట్ పోల్స్ ఎ విధం గా పరిగణం లో కి తీసుకున్నాయి ? వీటి గురించి విశ్లేషిస్తే , ఎగ్జిట్ పోల్స్ లో విశ్లేషకులు ఈ గణాంకాలను పరిగణం లోకి తీసుకోకుండానే ఎగ్జిట్ పోల్స్ జరిపివుండచ్చన్నఅనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం , అనుకున్న విధంగానే వెలువడితే మార్కెట్లు సోమవారం పెద్దగా ప్రతికూలం గా ఉండబోవు. మరి ఎగ్జిట్ పోల్స్ తప్పు గా నిర్ధరనైతే సోమవారం మార్కెట్లు మనల్ని మరొక సారి ఆశ్చర్య పరచనున్నాయి.
....