మార్కెట్ సమీక్ష ( మే 11 నుండి మే 15 వరకు )

16-05-2009 ::

భారి FII కొనుగోళ్ళ వలన, వారం లో అధిక శాతం ప్రపంచ మార్కెట్లు బలంగా ఉండటం తో మన మార్కెట్లు వరుసగా 10 వ వారం లాభాలతో ముగిసింది. ఎన్నికల ఫలితాల నిరీక్షణ , మధ్య మధ్య లో విపరీతమైన ఒడిదుడుకులతో మార్కెట్లు ఈ వారం లో పయనం సాగించాయి. అమెరికా మార్కెట్ల లో ప్రతివ్రుద్ధి ని నమోదు చేసిన రిటైల్ అమ్మకాలు, గత 25 సంవత్సరాలలో గరిష్ట స్థాయి లో నిరుద్యోగం మున్నగు అంశాలు వారం మధ్య లో మన మార్కెట్లను కూడా ప్రభావితం చేసింది. ఈ వారం లో మార్కెట్లు 296.99 పాయింట్లు వృద్ధి ని నమోదు చేసి 12173. 42 వద్ద ముగిసింది.

గత వారం సెన్సెక్స్ షేర్లలో RANBAXY అత్యధికంగా 12.2 % వృద్ధి ని నమోదు చేయగా , HDFC -11.3 %, ICICI బ్యాంకు -10.3 % పెరిగాయి. DLF 9.9 % వాటాని సంతాగత మదుపరులకు అమ్మటం ఈ వారం లో చెప్పుకోదగ్గ అంశం.

ఇతర షేర్లలో RELIANCE INFRA, GRASIM, WIPRO 6.5 % నుండి 5.3 % వరకు వృద్ధి ని నమోదు చేయగా , INFOSYS, AIRTEL , RCOM, MNM, RIL, TCS, MARUTI SUZUKI చెప్పుకోదగ్గ లాభాలను ఆర్జించాయి.

నష్టపోయిన షేర్లలో ONGC సుమారు 8 % నష్ట పోగా , STERLITE 6.5 % , HUL, TATA STEEL 6.7కోల్పోయాయి. ,NTPC, SBI, JP ASSOCIATES కూడా నష్టాలబాటలో నడిచాయి.

MSCI సూచిలో బజాజ్ ఆటో ని చేర్చటం తో ఈ కౌంటర్ 16.5 % లాభ పడింది. BSE FMCG రంగం 1.84 % నష్టాన్ని నమోదు చేయగా , METALS , PSU 1 % నష్టాని నమోదు చేసాయి.

BYANKEX రంగం 6.13 % అత్యధికం గా లాభ పడగా , IT మరియు TECK 4.6 % ,4.04 % లాభాలను ఆర్జించింది.

BSE MID CAP 1 % లాభాలను ఆర్జించగా, SMALL CAP 2.34 % లాభపడింది.

.........