గత వారం సమీక్ష (25-05-2009 నుండి 29-05-2009 ) ఈ వారం సెన్సెక్స్ వరుసగా 12వ వారం లాభం పడి అనూహ్య రీతి లో మదుపరులకు లాభాల పంట ని పండించాయి. సెన్సెక్స్ గత వారం ముగింపైన 13887పాయింట్ల వద్ద ప్రస్థానాన్ని కొనసాగించి 738పాయింట్లు లాభ 14625 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం లో సెన్సెక్స్ గరిష్టం గా 14720 పాయింట్లకు ఒక దశ లో చేరుకుంది. మేము గత వారం "మార్కెట్ ముందు చూపు " లో సెన్సెక్స్ 14888 పాయింట్ల వరకు చేరే అవకాశం ఉందని చర్చించాము. మా అంచనాలను దాదాపు నిజం చేస్తూ సెన్సెక్స్ పయనం సాగించింది. ఈ వారం లో రోజు వారిగా మార్కెట్ల గమనం ఈ విధం గా ఉన్నాయి.
  • సోమవారం
మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యి, చివరకు ఫ్లాట్ గా ముగిసింది.సెన్సెక్స్ 26 పాయింట్లు లాభ పడి 13913 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ ఒక పాయింటు నష్టపోయి 4237.55 వద్ద ఫ్లాట్ గా ముగిసింది. మార్కెట్లు తీవ్రమైన ఓడిడుడులకు లోనయ్యి దిశా హీనంగా పయనించాయి. ఒక దశ లో సెన్సెక్స్ 14000 పాయింట్లు దాటినా 13978 పాయింట్ల అవరోధం తీవ్రం గా ఉన్నందు వలన , సెన్సెక్స్ ముందుకు దూసుకోని పోలేక మరల చతికిల పడింది.
  • మంగళవారం
మార్కెట్లలో భాలూకాలు పట్టు బిగించాయి. మార్కెట్లలో భారి స్థాయి లో లాభాలను బుక్ చేసుకోవటం, ఉత్తర కొరియా అణు పరీక్షా ప్రభావం, గురువారం తో గడువు తీరిపోనున్న మే నెల తాలూకు F & O , -ఈ అంశాలన్నీ భాల్లుకాలకి ఆయుధాలు సమకూర్చినట్లయ్యింది . ఉదయం మార్కెట్లు ఓడిదుదుకులతో ప్రారంభమయ్యి, నష్టాల బాటలో జారుకున్నాయి మధ్యాన్నానికి , లండన్ మార్కెట్లు నష్టాల తో ప్రారంభమయ్యే సరికి, మన మార్కెట్లు కూడా భారి గా నష్టపోయాయి. సెన్సెక్స్ 324 పాయింట్లు నష్ట పోయి 13589 పాయింట్ల వద్ద ముగిసింది.
  • బుధ వారం :
మార్కెట్లు బలమైన ప్రపంచ మార్కెట్ల సహాయం తో విజయభేరి మ్రోగించాయి. నాడు మార్కెట్లు ఇంచుమించు 13978 పాయింట్ల అవరోధం వద్ద పయనం సాగించింది , చివరికి 520 పాయింట్ల లాభాలను ఆర్జించి 14109 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 159 పాయింట్లు లాభ పడి 4276 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్ధిక మంత్రి శ్రీ ప్రనాబ్ ముఖర్జీ గారు చేసిన ప్రకటనలో తో ఇన్ఫ్రా రంగానికి రాబోయే బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు చేసిన ప్రకటన తో మార్కెట్ వర్గాలలో , క్రుంగు తున్న సెంటిమెంట్ కి జీవం పోశారు.
  • గురు వారం :
మే నెల F & O ముగియటం తో , షార్ట్ కవరింగ్ సహాయం వలన మన మార్కెట్లు సుమారు 1.3 % లాభం పడ్డాయి. BSE 30 షేర్ల సూచీ 183.67 పాయింట్లు లాభ పడి 14296 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 1.4 % వృద్ధి ని నమోదు చేసి 4337.10 వద్ద ముగిసింది.
  • శుక్రవారం
మెరుగైన ఆర్ధిక రంగం గణాంకాలు , ఆయిల్ మంత్రిత్వ శాఖ ఆయిల్ సంస్కరణ పట్ల చేసిన ప్రకటన నేపథ్యం లో మార్కెట్లు లాభాలలో ముగిసాయి. నేటి ముగింపు తో మన క్యాపిటల్ మార్కెట్లు వరుసగా 12వ వారం జైత్ర యాత్ర ని కొనసాగించినట్లయ్యింది. సెన్సెక్స్ 329 పాయింట్లు లాభం పొంది 14625 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 119 పాయింట్లు లాభం పది 4449 పాయింట్ల కు చేరుకున్నది. చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేస్తున్నట్లు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్‌రా ప్రకటన , నాలుగో త్రైమాసికపు జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) సంఖ్యల ప్రకటన ఇన్వెస్టర్లు స్వాగతించడంతో స్టాక్ మార్కెట్ లాభాలతో మరింతగా పుంజుకున్నాయి. జీ .డి . పి. 5.8 % వృద్ధిని నమోదు చేసింది. ఇదే గతం లో ని మూడవ త్రై మాసిక ఫలితాలు 5.3 % మాత్ర మే ఉండింది.
  • సెన్సెక్స్ లాభాల పంట :
Index (%)------- వారం-----------నెల
  • Realty -----------15.38---------- 79.౩౦
  • Metal ------------11.68----------- 57.98
  • Smallcap ----------8.59----------- 51.92
  • Capital Goods------7.32----------- 50.74
  • Bankex ------------5.50---------- 45.26
  • Midcap------------ 6.33----------- 43.91
  • Power------------- 5.28---------- 36.38
  • Auto ------------- 5.29--------- -31.80
  • Sensex----------- 5.31----------- 28.26
  • Oil & Gas--------- 6.17----------- 28.12
  • Nifty--------------4.97---------- 28.07
  • IT---------------- 5.92---------- 12.55
  • Healthcare---------1.74--------- 11.99
  • FMCG------------ 0.77---------- 0.08
ఇక స్టాకులను విడిగా పరిశీలిస్తే RANBAXY -26 %, DLF -21.8 %, IDEA, UNITECH,REL INFRA,ONGC 11~17% , వృద్చిని నమోదు చేసి అధికంగా లాభం పడ్డ వాటాలు గా నిలికాఃయి. కాగా TATACOMM-20.6 %, SUN PHARMA -6.3 %, BHARTI AIRTEL 4.3 % నష్టపోయాయి. మెటల్స్ రంగం లో STERLITE 22 %, HINDALCO -10 %, TATA STEEL 11.3 % , క్యాపిటల్ గూడ్స్ రంగం లో BHEL -9.7 %, LNT- 7.4 %, SIEMENS - 7% , ఐ. టి. రంగం లో TCS-10.8 %, WIPRO , INFOSYS -3.5 ~ 5 %, మిడ్ క్యాప్ NMDC -50% ,GIC HOUSING 48%, DISHMAN -,-37 %, JP HYDRO -30 % లాభాలను ఆర్జించి , మదుపరులను ధనవంతులు గా తీర్చిదిద్దాయి.
  • .............................