- మార్కెట్ నాడి 29-05-2009 :: 6: 30 PM
మేరుగిన్ ఆర్ధిక రంగం గణాంకాలు ,
ఆయిల్ మంత్రిత్వ శాఖ ఆయిల్ సంస్కరణ పట్ల చేసిన ప్రకటన నేపథ్యం లో నేడు మార్కెట్లు లాభాలలో ముగిసాయి.
నేటి ముగింపు తో మన క్యాపిటల్ మార్కెట్లు వరుసగా 12
వ వారం జైత్ర యాత్ర ని కొనసాగించినట్లయ్యింది.
నేటి మార్కెట్ లో సెన్సెక్స్ 329 పాయింట్లు లాభం పొంది 14625 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ ప్రధానం గా మేము సూచించిన 14686 పాయింట్ల అవరోధం వద్ద నే సంచరించటం చెప్పుకోదగ్గ అంశం. ఒక దశ లో మార్కెట్లు 14724 పాయింట్ల వరకు ఎగబాకింది. ఐతే మేము సూచించినట్లు, చివర లో కొంత నష్ట పోయి 14625 పాయింట్ల వద్ద ముగిసింది. కాగా నిఫ్టీ 119 పాయింట్లు లాభం పది 4449 పాయింట్ల కు చేరుకున్నది.
నేటి మార్కెట్ల లో చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేస్తున్నట్లు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవ్‌రా ప్రకటన , నాలుగో త్రైమాసికపు జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) సంఖ్యల ప్రకటన ఇన్వెస్టర్లు స్వాగతించడంతో స్టాక్ మార్కెట్ లాభాలతో మరింతగా పుంజుకున్నాయి. జీ .డి . పి. 5.8 % వృద్ధిని నమోదు చేసింది. ఇదే గతం లో ని మూడవ త్రై మాసిక ఫలితాలు 5.3 % మాత్ర మే ఉండింది.
నేటి మార్కెట్ లో రియాల్టి రంగం అత్యధికంగా 6.76% వృద్ధిని నమోదు చేసింది. క్యాపిటల్ గూడ్స్ 4.13 % లాభం పడింది. నేటి మార్కెట్ లో కేవలం హెల్త్ కేర్ రంగం మాత్ర మే స్వల్పం గా 1.36 % నష్టపోయింది.
నేడు స్మాల్ క్యాప్ 3.01 %, మిడ్ క్యాప్ 2.46 % లాభం పడింది. సెన్సెక్స్ స్టాకు ల లో ACC 8.6 %, DLF 8.4 % అత్యధికం గా వృద్ధి పొందాయి. సన్ ఫార్మా , గ్రాసిం అధికంగా 8.2 % , 3.6 % నష్టపోయాయి
.......