28-05-2009 :: 5: 45 pm

మార్కెట్ నాడి

నేటి తో మే నెల F & O ముగియటం తో , షార్ట్ కవరింగ్ సహాయం వలన మన మార్కెట్లు , నేడు సుమారు 1.3 % లాభం పడ్డాయి. BSE 30 షేర్ల సూచీ 183.67 పాయింట్లు లాభ పడి 14296 పాయింట్ల వద్ద ముగియగా నిఫ్టీ 1.4 % వృద్ధి ని నమోదు చేసి 4337.10 వద్ద ముగిసింది.

నేటి మార్కెట్లు ప్రారంభ సమయానికి ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాలలో పయనిస్తున్నాయి. ఐతే , మా అంచనాలని నిజం చేస్తూ ,మేము ఉదయం సూచించిన విధంగా ప్రపంచ మార్కెట్లకి అతీతం గా మన మార్కెట్లు పయనం సాగించాయి. నేటి మార్కెట్ లో మెటల్స్ 2.76 % , పి . ఎస్. యు. 2.34 % ,బ్యాంకింగ్ 1.81 % వృద్ధి ని నమోదు చేసి అధికంగా లాభ పడిన రంగాలుగా నిలిచాయి. నేడు హెల్త్ కేర్ , ఐ. టి. రంగాలు స్వల్పంగా నష్టాలను నమోదు చేసాయి.

నేటి మార్కెట్ లో మిడ్ క్యాప్ స్టాకులు ౦.78 % , స్మాల్ క్యాప్ స్టాకులు ౦.24 % వృద్ధిని నమోదు చేసాయి.

నేడు మే 16 నకు చెందిన ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలయ్యాయి .ఈ సారి కూడా , సరిగ్గా గత వారం

విధంగానే 0.61 % పెరుగుదల నమోదయ్యింది.

ఇక స్టాకుల గురించి పరిశీలిస్తే , గత మూడు రోజులుగా భారిగా నష్ట పోయిన అయిర్ టెల్ 3.4 % వృద్ధిని నమోదు చేసి రూ. 795/- వరకు ఎగబాకింది. సెన్సెక్స్ స్టాకు ల లో నేడు RANBAXY అత్యధికంగా 2.8 %, STERLITE 2.3 % , లాభపడగా, TATA MOTORS, GRASIM 3.2 %., 2.8 % నష్టపోయాయి.

..............