27-05-2009 :: 8 am.

మార్కెట్ నాడి

నేడు మే నెల తాలూకు F & O ముగింపు కనుక మార్కెట్లు నేడు రోల్ ఓవర్లు మీద దృష్టి సారించ నున్నాయి. మార్కెట్ల గమనం ప్రధానంగా , నేడు రోల్ ఓవర్లు మీదనే ఆధార పడిఉంది.

నిన్న అమెరికా మార్కెట్లు నష్టపోవడం, నేడు ఆసియా మార్కెట్లు కూడా ఒడిదుడుకులతో ప్రారంభం చేయటం తో మన మార్కెట్ల లో నేడు గొప్ప ప్రారంభం ఉంటుంది అని చెప్పలేము. పైగా సెన్సెక్స్ నిన్నటి ముగింపు తో 14 వేలపాయింట్లు దాటటం వలన మదుపరులలో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనే యోచన కూడా ఉండే అవకాశం ఉంది. నేడు మే 16 తాలూకు ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల కానున్నాయి. దీని ప్రభావం మార్కెట్ల పై ఉండ నున్నది.

F & O ముగింపు కారణం వలన, నేడు మన మార్కెట్లు గ్లోబల్ మార్కెట్ల తీరు తెన్నుల కి అతీతంగా వ్యవహరించే ఆస్కారమే ఎక్కువగా ఉంది. మన మార్కెట్ గమనం పూర్తిగా రోల్ ఓవర్లు మీదనే ఆధారపడి ఉన్నదని చెప్పవచ్చు.

సెన్సెక్స్ కీలక మజిలీలు

కీలక అవరోధాలు : 14243-14686

కీలక మద్దత్తు స్థాయిలు : 13978-13886-13781

........................