27-05-2009 :: 8 AM
మార్కెట్ నాడి
నిన్న మార్కెట్ల లో భల్లూకాలు ముందంజ వేసాయి. నేడు కూడా మార్కెట్ సెంటిమెంట్ బలహీనం గా ఉందనే చెప్పాలి . ఉత్తర కొరియా మరిన్ని అణుపరిక్షలు చేయవచ్చని అనుమానాలు వ్యక్తముతున్నాయి. దీని వలన అమెరికా డాలర్ పెరగటం, మన రూపాయి మరింత క్షీణించే అవకాశం ఉంది. ఇదే జరిగితే సెంటిమెంట్ మరింత బలహీన పడే అవకాశాలు ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ మినహా , ఇతర ప్రముఖ మైన కరెన్సీ లు భారి గా కోల్పోతున్నాయి. ఇటువంటి పరిస్తితులు తలెత్తితే FII లు తమ డబ్బుని తరలిస్తాయని గతం మనకి తెలియచేస్తోంది.
ఐతే నిన్న అమెరికా మార్కెట్లు భారిగా లాభాపడం , నేడు ఆసియా మార్కెట్లు శుభా రంభం చేయటం మన మార్కెట్ల కి కొంత ఊరట కలగ నున్నది. మే తాలూకు F & O నకు రేపటి తో గడువు ముగియ నున్నది. మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నా ,F & O రోల్ ఓవర్లు బట్టి మార్కెట్ గమనం ఆధార పడి ఉంటుంది. రూపాయి విలువ పడి పోతున్నందున నేడు ఐ. టి. స్టాక్స్ కి కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది.
మా అంచనా ప్రకారం నేడు మన మార్కెట్లు నిన్నటి నష్టాలను పూరించుకోవచ్చు.
మార్కెట్ చివరి గంట ట్రేడింగ్ లో కొంత విపరీత ధోరణి కనిపించ వచ్చు.
నేటి సెన్సెక్స్ నకు కీలక మజిలీలు
కీలక అవరోధాలు : 13781-13978-14243
కీలక మద్దతులు : 13590 -13232-13113
.............