27-05-2009 :: 6:00 PM
మార్కెట్ నాడి
నేడు మార్కెట్లు బలమైన ప్రపంచ మార్కెట్ల సహాయం తో విజయభేరి మ్రోగించాయి. ఉదయం మేము సూచించిన విధం గా నేడు మార్కెట్లు ఇంచుమించు 13978 పాయింట్ల అవరోధం వద్ద పయనం సాగించింది , చివరికి 520 పాయింట్ల లాభాలను ఆర్జించి 14109 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి చివరి గంట లో సుమారు 170 పాయింట్లు లాభ పడి , మేము ఉదయం చెప్పిన అంచనాలను , మరొకసారి నిజం చేసాయి . నిఫ్టీ 159 పాయింట్లు లాభ పడి 4276 పాయింట్ల వద్ద ముగిసింది.
నేడు మన ఆర్ధిక మంత్రి శ్రీ ప్రనాబ్ ముఖర్జీ గారు చేసిన ప్రకటనలో తో ఇన్ఫ్రా రంగానికి రాబోయే బడ్జెట్ లో ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు చేసిన ప్రకటన తో మార్కెట్ వర్గాలలో , క్రుంగు తున్న సెంటిమెంట్ కి జీవం పోశారు.
వారు చేసిన ప్రకటన తో ఇన్ఫ్రా రంగానికి చెందిన స్టాకులు బాగా పుంజుకున్నాయి.
నేడు ఇన్ఫ్రా రంగం 6.1 % లాభ పడగా , బ్యాంకింగ్ రంగం 5.4 % వృద్ధిని నమోదు చేసింది. నేటి మార్కెట్లో అన్ని రంగాలు వృద్ధిని నమోదు చేయటం విశేషం. నేడు మిడ్ క్యాప్ రంగం 3.67 % , స్మాల్ క్యాప్ 3.37 % లాభాలను ఆర్జించాయి
నేటి ట్రేడింగ్ లో సెన్సెక్స్ స్టాకులలో RELIANCE INFRA 14.7 % వృద్ధిని నమోదు చేసింది. కాగా STERLITE 9.5 % లాభం పొందింది . నేటి మార్కెట్లో అయిర్ టెల్ , ఐ. టి. సి. 0.2 % నష్టాలను నమోదు చేసింది.
......
...