26-05-2009 :: 6:15 PM
మార్కెట్ నాడి
నేటి మార్కెట్లలో భాలూకాలు పట్టు బిగించాయి. మార్కెట్లలో భారి స్థాయి లో లాభాలను బుక్ చేసుకోవటం, ఉత్తర కొరియా అణు పరీక్షా ప్రభావం, గురువారం తో గడువు తీరిపోనున్న మే నెల తాలూకు F & O , -ఈ అంశాలన్నీ భాల్లుకాలకి ఆయుధాలు సమకూర్చినట్లయ్యింది .
మేము ఉదయం సూచించినట్లు మార్కెట్లు ఓడిదుదుకులతో ప్రారంభమయ్యి, నష్టాల బాటలో జారుకున్నాయి . నేటి మధ్యాన్నానికి , లండన్ మార్కెట్లు నష్టాల తో ప్రారంభమయ్యే సరికి, ఉదయం మేము సూచించిన విధం గా మన మార్కెట్లు కూడా భారి గా నష్టపోయాయి. నేడు సెన్సెక్స్ 324 పాయింట్లు నష్ట పోయి 13589 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది మేము సూచించిన 13592 పాయింట్ల మద్దతు స్థాయి అని గుర్తించాలి. మేము సూచించిన స్థాయి వద్దనే సెన్సెక్స్ ముగియటం విశేషం. కాగా నిఫ్టీ 120.85 పాయింట్లు నష్టపోయి 4116.7 పాయింట్ల వద్ద ముగిసింది.
గత కొన్ని రోజులు గా మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ జోరు కి నేటి ట్రేడింగ్ తో బ్రేక్ పడింది. మిడ్ క్యాప్ 3.4 % నష్టపోగా, స్మాల్ క్యాప్ 3.12 % నష్టపోయాయి. గత కొన్ని రోజులు వరుసగా నష్టపోతున్న ఐ. టి. రంగం మినహా నేడు సెన్సెక్స్ లో ని అన్ని రంగాలు నష్టాలను చవిచూసాయి. రియాల్టి ౩.96 %, బ్యాంకింగ్ రంగం 3.13 % నష్టపోయాయి.
సెన్సెక్స్ స్తాకులలో R.COM అత్యధికం గా 9.6 % నష్టపోగా, RANBAXY 8.4 % నష్ట పోయాయి. HINDALCO 3.2 % , INFOSIS 2.3 % లాభపడ్డాయి.
.......................