26-05-2009 :: 8:30 AM
మార్కెట్ నాడి
నిన్న ఉత్తర కొరియా జరిపిన అణుపరీక్షా ప్రకంపనలు నేడు స్టాక్ మార్కెట్ లో కనబడే అవకాశం ఉంది. నిన్న అమెరికా, లండన్ మార్కెట్లు బ్యాంక్ సెలవ కారణం గా , మూసివేసారు. నేడు ఆ దేశాలకి చెందిన విదేశీ సంస్థాగత మదుపరులు మరల రంగం లోకి దిగనున్నారు. వారు ఆసియా నుండి పెట్టుపడులు ఉపసహ్మరిస్తారని అనుమానాలు వ్యక్తమౌతోంది. ఈ అనుమానం వల్లనే , నిన్న రూపాయి విలువ కూడా ,అమెరికా డాలర్ తో పోలిస్తే పడిపోయింది. ఐతే ఈ విషయం లో ఆసియా మార్కెట్ల గమనాన్ని బట్టే మన మార్కెట్లు కూడా ప్రతిక్రియలు జరపనున్నాయి. ఇప్పటివరకు ఆసియా మార్కెట్లు కొంత ఒడిదుడుకుల తో ట్రేడ్ అవుతున్నాయి . భారి అమ్మకాల ఛాయలు లేవు. కాని మధ్యాన్నం లండన్ మార్కెట్లు ప్రారంభం ఎలా జరుగుతుందో , దానిని బట్టి మధ్యాన్నం తరువాత మన మార్కెట్లు పయనించే అవకాశం ఉంది.
పైగా నిన్న మార్కెట్లో స్మాల్ క్యాప్ రంగం అత్యధికంగా రాణించింది. సాధారణం గా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో చలనం , రాబోయే CORRECTION కి చిన్హం గా చెప్పుకొనవచ్చు.
ఇది ఇలా ఉండగా, ఆర్ధిక మంత్రిత్వ శాఖ కృంగుటున్న ఎగుమతులు , ఇన్ఫ్రా రంగాల గురించి మరొక ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించ నున్నదని వార్త. కాబాటి నేటి మార్కెట్ లో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ర్యాలీ వచ్చే అవకాశం ఉంది.
నేడు పరస్పర విరుద్ధమైన కీలక అంశాలు మార్కెట్ల ముందు వున్నాయి కనుక మన మార్కెట్లు ఒడిదుడుకులకు మరొకసారి లోనుకానున్నది.
నేటి సెన్సెక్స్ కి కీలకమజిలీలు.
అవరోధాలు : 13978- 14243-14686
మద్దత్తు స్థాయిలు : 13781-13592-13232
................