25-05-2009 :: 5.00 PM
మార్కెట్ నాడి .. నేడు మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యి, చివరకు ఫ్లాట్ గా ముగిసింది. నేడు సెన్సెక్స్ 26 పాయింట్లు లాభ పడి 13913 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ ఒక పాయింటు నష్టపోయి 4237.55 వద్ద ఫ్లాట్ గా ముగిసింది. నేడు మార్కెట్లు తీవ్రమైన ఓడిడుడులకు లోనయ్యి దిశా హీనంగా పయనించాయి. ఒక దశ లో సెన్సెక్స్ 14000 పాయింట్లు దాటినా మేము సూచించిన 13978 పాయింట్ల అవరోధం తీవ్రం గా ఉన్నందు వలన , సెన్సెక్స్ ముందుకు దూసుకోని పోలేక మరల చతికిల పడింది. నేటి మార్కెట్లో కన్సుమేర్ ద్యుర బుల్ రంగం అత్యధికంగా 4.79 % లాభాలను నమోదు చేయగా, రియాల్టీ రంగం 4.25 % వృద్ధిని నమోదు చేసింది. .టి. రంగం నష్టాల పరంపర ని ఇంకా కొనసాగిస్తూ 0.33 % నష్టపోయింది. ఐతే నేటి ట్రేడింగ్ లో టెక్ షేర్లు అధ్యధికం గా 0.89 % నష్టాలను చవిచూసింది. ఇక శర్లని పరిశీలిస్తే , నేడు RANBAXY అత్యధికంగా 20.73 % వృద్ధిని నమోదు చేయగా JP HYDRO 20.06 % ,GLENMARK 13.7 % లాభాలను ఆర్జించాయి. ఐతే పసిఫిక్ ఇండస్ట్రీస్ 2757.14 % వృద్ధిని నమోదు చేసి ఆశ్చర్యం కలిగించింది. భారతి అయీర్ టెల్ 5.41 % , సుజ్లాన్ 5.37 % అత్యధికంగా క్షీణించాయి. నేడు స్మాల్ క్యాప్ అత్యదికంగా 5.01 % లాభ పడగా, మిడ్ క్యాప్ 2.83 %, సెన్సెక్స్ షేర్లు 0.19 % లాభ పడ్డాయి ....... .......