24-05-2009
మార్కెట్ ముందుచూపు
(మే 25 నుండి మే 29 వరకు)
వారం మన మార్కెట్లు ముఖ్యంగా మన మంత్రులు ప్రకటించే ఉద్దీపన పధకాలు, చేయూత హామీలు మున్నగు అంశాల పై ద్రుష్టి సాగించ నున్నది. వారం వివిధ రంగాల కి చెందిన స్టాకులు, ఒక్కో రీతిగా ప్రవర్తించే అవకాశం ఉంది. ఒక కథ లో గుడ్డివారు ఏనుగు ని ఒక్కో రీతిన అంచనా వేసి, ఒకరి కి ,మరొకరికి మధ్య సామరస్యం లేని విధంగా ప్రవర్తించి నట్లు, స్టాకులు వివిధ మంత్రిత్వ శాఖల ప్రటనల మూలం గా , పలు రీతులలో ప్రవర్తించే అవకాశం ఉంది. ప్రనాబ్ ముకర్జీ ఆర్ధిక మంత్రి గా మరల పగ్గాలు చేపట్టారు. వారు ఈ సారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ తాలూకు చమక్కులు అప్పుడప్పుడు , ఈ వారం లో మనకు వినవస్తాయి. ఇప్పటికే , వ్యక్తీగత ఆదాయపు పన్ను లో రెండు లక్షల వరకు మినహాయింపు అనే ప్రకటన వినవచ్చింది.ఈ వారం , ఉద్దేపన ప్యాకేజి క్రింద ఖర్చు కి సరిపడా ఆదాయం సమకూర్చే విధానం ముఖ్య చర్చనీయ అంశం కా నున్నది. ఉద్దేపన ప్యాకజి తో పాటు సంస్కరణల ప్యాకజి కొరకు మార్కెట్లు ఎదురు చూస్తున్నాయి. ఇన్సురన్సు రెగ్యులేటర్ ఇప్పటికే , ఇన్సురన్సు కంపెనీల IPO కి సంబంధించిన మౌలిక సూత్రాలపై కసరత్తు చేస్తునట్లు వార్త.
. ప్రపంచ మార్కెట్ల పరిస్థితిని పరిశీలిస్తే, గత వారం IMF యూరో మార్కెట్ల ని De- rating చేయటం జరిగింది. అమెరికా ని సైతం AAA RATING నుండి తగ్గించే అవకాశం ఉందని భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే జరిగితే మన మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. . మన మార్కెట్లను పరిశీలిస్తే, గత వారం సెన్సెక్స్ ఎదురుకున్న అవరోధం వారం కూడా , ప్రతిబంధకం కా నున్నది. సెన్సెక్స్ 14,364 పాయింట్లకి, ఆ తరువాత 14880 పాయింట్ల కి గట్టి అవరోధం ఉన్నది. వారం సెన్సెక్స్ అవరోధాలను అధికమించే ప్రయత్నం చేయనున్నది.
సెన్సెక్స్ కి 13765 -13568 పాయింట్ల వద్ద మంచి మద్దత్తు ఉంది. ఘోరమైన వార్త వినవస్తే తప్ప 13159 పాయింట్ల కంటే తగ్గే అవకాశం తక్కువ . వారాంతానికి F & O ముగింపు గనుక మార్కెట్లు చివరి రెండు రోజులు ఒడిదుకులకు లోనయ్యే అవకాశం ఉంది.
................