25-05-2009
మార్కెట్ నాడి
నేడు మన మార్కెట్లు ప్రధానం గా కొత్త సర్కారు చేసే ప్రకటనల మీద ద్రుష్టి పెట్టనున్నది. సంస్కరణల అమలు పట్ల నూతన మంత్రులు చేసే వ్యాఖ్యానాలు,నేడు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. ఇప్పటికే ఆయిల్ మంత్రిత్వ శాఖ , సామాన్యుడి పై భారం పడనివ్వమని చేసిన ప్రకటన నేడు పి. యస్. యు . ఆయిల్ కంపనీల పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఆసియా మార్కెట్లు నేడు ఒడిదుడుకులతో , క్రమంగా నష్టాల లోకి జారు కుంటున్నాయి. మన మార్కెట్లు కూడా , కొంత వరకు ఆసియా మార్కెట్ల తో శృతి కలిపి నష్టాలతో ప్రారంభమ అయ్యే అవకాశం ఉంది. పైగా ఆర్ధిక మంత్రిత్వ పదవి నిపుణులు కాక , రాజకీయ వేత్త ని ఎన్నుకోవటం పట్ల మార్కెట్లు కొంత నిరాశ చెందాయి.
నేడు సెన్సెక్స్ ఓడిదుదుకులతో పయనం సాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
సెన్సెక్స్ కి కీలక మజిలీలు
RESISTANCE : 13978- 14243-14686
SUPPORT : 13781-13592-13232
...........................