మార్కెట్ నాడి
22-05-2009 :: 8 .00 AM
నేడు మార్కెట్లు మరొక సారి ప్రాఫిట్ బూకింగ్ కి సిద్ధం కానున్నాయి. నిన్న సెన్సెక్స్ స్టాక్లు నష్టాలు చవిచూసినా స్మాల్ క్యాప్ , మిడ్ క్యాప్ షేర్లు కొద్దిగా లాభ పడ్డాయి. నేడు మిడ్ క్యాప్ షేర్లలో ప్రోఫ్ట్ బూకింగ్ ధోరణి స్పష్టంగా కనిపించనున్నది. పైగానిన్న అమెరికా మార్కెట్లు నష్టాల తో ముగియటం- ,తీవ్రతరం అవుతున్న నిరుద్యోగ సమస్య కారణం గా అమెరికా ఆర్థికాభివృద్ధి పై ఫెడ్ నిరాశ వంటి కారణాలు మన మార్కెట్ ని క్రుంగ దీసే అవకాశం ఉంది. నేడు ఆసియా మార్కెట్లు కూడా నష్టాల తో ప్రారంభమయ్యి ఒడిదుడుకులతో ముందుకు సాగటం మన మార్కెట్ల లో భాల్లూకాలకి ఉత్సాహం కలిగించనున్నది.
ఐతే రెండు రోజులు గా నష్టాల బాట లో నడుస్తున్న మార్కెట్ లో కొన్ని స్టాక్ ల లో మరల విలువ కనవస్తోంది కనుక , మంచి స్టాక్ లను మదుపరులు కొనుక్కునే అవకాశం కూడా ఉంది. ఈ పక్షం లో మార్కెట్ల లో చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు.
మా అంచనా ప్రకారం నేడు మార్కెట్లు ఒడిదుడుకులతో ముందుకు సాగే అవకాశం ఉంది. మిడ్ క్యాప్ షేర్ల కి దూరం గా ఉండటం శ్రేయస్కరం.
నేడు సెన్సెక్స్ కి కీలక మజిలీలు
అవరోధాలు :13781- 13978 - 14243
మద్దత్తు : 13592-13232-13113
.....................