మార్కెట్ నాడి
21-05-2009 :: 6:00 Pm
నేడు వరుసగా రెండవ రోజు మన మార్కెట్లు నష్టాలలో ముగిసాయి. బలహీనమైన ప్రపంచ మార్కెట్ల నడుమ మన మార్కెట్లు కూడా శృతి కలిపాయి. నేడు సెన్సెక్స్ 324 పాయింట్లు నష్ట పోయి 13736 వద్ద ముగిసింది. కాగా నిఫ్ట్ 59 పాయింట్లు నష్టపోయి 4210 పాయింట్ల వద్ద ముగిసింది. నేటి మార్కెట్లో స్మాల్ క్యాప్ లు 2.6 % లాభం పడగా, మిడ్ క్యాప్ లు ఫ్లాట్ గా ముగిసాయి. నేడు పి . ఎస్ . యు -ఆయిల్ కంపెనీలు సంస్కరణల వార్తలు వినవస్తున్నందున అధికంగా లాభం పడ్డాయి. ఆయిల్ కంపెనీలు ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీల హయామ నుండి ఫ్రీ మార్కెట్ క్రింద మార్చాలని ఆయిల్ మంత్రిత్వ శాఖ యోచన.
ఇది కాగా , మే 9 నకు చెందిన ద్రవ్యోల్బణం 0.61 % గా తేలింది. అంతకు ముందు వారం ఇది 0.48 % గా నమోదయ్యింది.
నేడు సెన్సెక్స్ లో BSE క్యాపిటల్ గూడ్స్ 5.4 % నష్టాన్ని నమోదు చేయగా, బ్యాంకింగ్ రంగం 2.9 % నష్టపోయింది. పి. ఎస్. యు 2.7 % లాభం పడగా ,ఆయిల్ మరియు గ్యాస్ 0.8 % లాభపడింది. సెన్సెక్స్ స్టాక్ ల లో ONGC మరియు R.COM 8.4 %, 4.5 % లాభపడ్డాయి. LNT , MARUTI 8.6 %, 6.9 % నష్టపోయాయి.
.........................