మార్కెట్ నాడి

21-05-2009 :: 8Am

ఆర్ధిక మంత్రి తప్పనిసరిగా రాజకీయ నాయకులే ఉండి తీరాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధి చేసిన తీర్మానం , నేడు మన మార్కెట్ల పై పిడిగు వేయనున్నది. ఆర్ధిక నిపుణులు ఈ సారి ఆర్ధిక మంత్రి అయ్యే అవకాశాలుంటాయని మన మార్కెట్లు కొంత ఊహా గానాలు చేసాయి. అమెరికా మార్కెట్లు కూడా గత రాత్రి లాభాలో పయనించి మరీ నష్టలలోకి దూకింది. మన మార్కెట్లు ప్రారంభమయ్యే సమయానికి ఆసియా మార్కెట్లు కూడా నష్టాల బాట నుండి బయట పడక పొతే, మన మార్కెట్లు నేడు నష్టాలు చవిచూడ నున్నాయి. ఐతే రాబోయే ఐదు సంవత్సరాలలో వాణిజ్య శాఖ చేపట్టనున్న కార్యక్రమాలు లో DEPB మార్చ్ 2010 వరకు పొడిగించ నున్నట్లు, fringe benifit tax (FBT) రద్దు చేయనున్నట్లు వార్తలు వినవస్తూన్నాయి. కాబాట్టి , నేడు ఎగుమతుల కి సంబంధించిన స్టాక్స్ లో కొంత చలనం ఉండే అవకాశం ఉంది.

నేడు WPI INFLATION గణాంకాలు విడుదల అవ్వనున్నందున, ఇది కూడా మార్కేట్లని నేడు ప్రభావితం చేయనున్నాయి.

మా అంచనా ప్రకారం నేడు మార్కెట్లు ప్రధానం గా భాలూకల గుప్పెట్లో సంచరించే అవకాశం ఉంది. దేశీయ / ఇన్సురన్సు సంస్థలు నేడు మార్కెట్ లో కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున , మార్కేట్లకి కొంత ఉపశమనం లభ్యమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.