నేడు సెన్సెక్స్ కి కీలక మజిలీలు
కీలక అవరోధాలు :
14243- 14686
మద్దత్తు స్థాయిలు
13978-13781-13592
................
మార్కెట్ నాడి
20-05-2009 :: 6:00 Pm
నేడు మార్కెట్లు మేము ముందుగా సూచించిన విధం గా ఒడిదుడుకులకు లోనయ్యి, మా అంచనాలకు అనుగుణంగా నష్టాలతో ముగిసాయి. నేడు మిడ్ క్యాప్ షేర్లు, స్మాల్ క్యాప్ షేర్లు గణనీయంగా 6% ,8.9 % లాభ పడ్డాయి. ఈ ఆంచనా కూడా మేము నేటి ఉదయమే మీకు తెలియచేసాము. నేడు సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయి 14060 వద్ద ముగియగా, నిఫ్టీ 48 పాయింట్లు నష్ట పోయి 4270 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ లో నేడు టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు, LIC నుండి 3250 కోట్ల రూపాయల నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ రూపం లో ఫండ్స్ లబ్ది పొందటం తో ,ఈ కౌంటర్ షేర్లు అత్యధికంగా 19 %, 13 % పెరిగాయి.
( కాగా , నేడు మేము సలహా పేజి లో సూచించిన "HANUNG TOYS", 18.05 % వృద్ధి పొందింది అని కూడా గమనించాలి. )
నేడు BSE CONSUMER DURABLE రంగం 9.7 % లాభ పడగా, మెటల్స్ 5.2 % లాభ పడింది. బ్యాంకింగ్ రంగం, ఆయిల్ మరియు గ్యాస్ రంగం 2.4 %, 2.1 % నష్టపోయాయి. సెన్సెక్స్ స్టాక్ లలో DLF, ICICI BANK 7.8 %, 6.6 % నష్టపోయాయి.
...........