మార్కెట్ నాడి

20-05-2009 :: 8:00 AM

రెండు రోజుల కొత్త సర్కారు విజయోత్సవ ర్యాలీ తరువాత నేడు మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల పై ద్రుష్టి పెట్టనున్నాయి. నిన్న అమెరికా మార్కెట్లు తీవ్రమైన ఒడిదుకులకు లోనయ్యి మన మార్కేట్లలాగే ఫ్లాట్ గా ముగిసింది. ఆసియా మార్కెట్లలో కూడా ఒడిదుడుకులు కానవస్తోంది. నేడు మన మార్కెట్లు కూడా ప్రపంచ మార్కెట్ల బాట లో నడిచే అవకాశం ఉంది. నేడు మన మార్కెట్ల లో అమ్మకపు వత్తిడి కనిపించ వచ్చు. ఐతే నేడు స్మాల్ క్యాప్ స్టాకులు ముందంజ వేసే అవకాశం ఉంది. గత రెండు రోజులు గా భారిగా గా వృద్ధి చెందిన షేర్లు , వాటి లాభాలను నేడు కొంత భల్లూకల తో పంచుకోవచ్చు.

కొత్త ప్రభుత్వం కొన్ని రంగాలకి చేయుతనిస్తామని సమావేశాలలో చేసే ప్రకటనల ప్రభావం వలన ఆయా రంగాల స్టాక్స్ ల లో మధ్య మధ్య లో కొంత పెరుగుదల కనిపించవచ్చు. కాబట్టి మదుపరులు ట్రేడింగ్ సమయం లో ప్రధాన మంత్రి చేసే ప్రకటనలపై కూడా నేడు ద్రుష్టి సారించాలి.

నేడు సెన్సెక్స్ కి కీలక స్థాయిలు :

అవరోధాలు : 14652-14725-14986

మద్దత్తు స్థాయిలు : 14279-13798-13547

....

......