మార్కెట్ నాడి
19-05-2009 :: 6:30 PM
మార్కెట్లు నిన్న లాభాలు అత్యదికంగా నమోదు చేసి లాభం పడి రికార్డు స్థాపించగా, నేడు మార్కెట్లు టర్న్ ఓవర్ లో రికార్డు ని నెలకొల్పాయి. నేడు మార్కెట్లు 1.58 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేసి గతం లో 18 అక్టోబర్ 2007 న 1.48 లక్షల కోట్ల రూపాయల రికార్డు ని తిరగ రాసింది. ఇది ఇలా ఉండగా , నేడు మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులతో పయనం సాగించింది. నేడు sensex 14655 పాయింట్ల దగ్గర ప్రారంభమయ్యి ఏకంగా 13834 వరకు పడిపోయింది.
ఈ ప్రారంభం , మేము ఉదయమే సూచించిన కీలక అవరోధం 14652 అని గుర్తించాలి . ఆ తరువాత మార్కెట్లు కొంత పుంజుకొని ప్రధానంగా 14600 వద్ద చాలా సేపు పయనం సాగించింది. మధ్య లో సెన్సెక్స్ 14930 పాయింట్ల వరకు ఎగబాకిన తిరిగి 14300 వరకు దిగజారి చివరకు 14302 పాయింట్ల వద్ద కేవలం 18 పాయింట్ల స్వల్ప లాభం తో ముగిసింది. కాగా నిఫ్టీ 5 పాయింట్లు నష్టపోయి 4318 వద్ద ముగిసింది.
నేటి స్టాక్ మార్కెట్లలో మేము ముందుగా సూచించిన విధంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాకులు లాభం పొందాయి .మిడ్ క్యాప్ షేర్లు 3.6 % , స్మాల్ క్యాప్ షేర్లు 2.5 % లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్ లో నేడు realty రంగం మరొకసారి భారిగా 12.8 % వృద్ధి ని నమోదు చేసాయి. బ్యాంకింగ్ రంగం 6.8 % వృద్ధిని నమోదు చేసి రెండవ స్థానం లో నిలిచాయి. DLF అధికంగా 19.4% , SBI 11.2 % వృద్ధిని నమోదు చేసాయి. ఐ. టి రంగం నేడు 10 % నష్టాలను నమోదు చేసాయి. ఇన్ఫోసిస్, విప్రో , 11.6 %, 9.1 % నష్టాలను చవిచూసాయి.
........