మార్కెట్ నాడి

19-05-2009 :: 7:30 AM

కిందటి ముగింపు తో చరిత్ర సృష్టించిన మార్కెట్ల కి , నేటి ప్రపంచ మార్కెట్లు కూడా లాభాల బాట లో నడుస్తూ మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మార్కెట్ దూకుడు తనం తగ్గటానికి ఒకటి రెండు రోజులు పట్టే అవకాశం ఉంది. మార్కెట్ల లో నెలకొని ఉన్నహుషారు న్యాయం గా చెప్పుకుంటే , పూర్తి గా అసమంజసం. అయినా స్పెక్యులషన్స్ కారణం గా మార్కెట్, fundamentals కి తిలోదకాలు ఇచ్చినట్లు కనిపిస్తున్నది. ఈ దూకుడు ఇదే విధం గా కొనసాగితే, నేడు మార్కెట్లు 15 వేల పాయింట్లు దాటినా ఆశ్చర్య పోవలసిన పనిలేదు. స్పెక్యులషన్స్ ఆగే వరకు , సునామి ధాటికి నిలువలేని చెట్ల లాగా , ప్రతీ అవరోధం నేలకూలవలసినదే. పైగా ఎన్నికల ముందు ఉన్న షార్ట్ పోసిషన్ గల బ్రోకేర్లు , నేడు కవర్ చేసుకునే ప్రయత్నం జరగనున్నది. ఇది మార్కెట్లు పెరిగేందుకు గాను మరింత ఉపకరించనున్నది.

నిన్నటి మార్కెట్ లలో సెన్సెక్స్ షేర్లు లాభ పడగా , మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు వాటి జోరుని చూపించలేదు. పరిశీలిస్తే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల లో ఇంకా కొంత విలువ కనిపిస్తోంది. కాబట్టి మదుపరులు , జాగ్రత్తగా , మంచి మిడ్ క్యాప్ షేర్లను ,తక్కువ PE నిష్పత్తి గల స్టాక్స్ ను ఎన్నుకోవడం మంచిది. తక్కువధరకి , గతం లో కొన్న స్టాక్స్ ని సుమారు సెన్సెక్స్ 14640 పాయింట్ల వద్ద కొంత సొమ్ము చేసుకోండి. గతం లో మార్కెట్లు నేలకూలినప్పుడు ఇరుక్కు పోయిన వారు కూడా , వారు కొన్న ధర పలికితే ఎగ్జిట్ అయ్యేందుకు ప్రయత్నించండి.

సెన్సెక్స్ కి కీలక మజిలీలు :

అవరోధాలు :

14652-15005 -15307-15740

మద్దత్తు స్థాయిలు :

13820-13232

....( గతం ముగింపు పై ప్రత్యెక EDITORIAL గురించి " మార్కెట్ ఫోకస్" పేజిని చూడగలరు.)