మార్కెట్ నాడి
18-05-2009 :: 6 PM
దేశ క్యాపిటల్ మార్కెట్ చరిత్ర లో నేడు అద్భుతం జరిగింది. చరిత్ర లో నే ప్రప్రధమంగా మార్కెట్లు UPPER సర్క్యూట్ చేరుకున్నాయి. మార్కెట్లు ప్రారంభమయిన కొన్ని క్షణాలకే 15 % గరిష్ట సర్క్యూట్ కి చేరుకుంది. అందుకని ట్రేడింగ్ నిలిపివేయడం జరిగింది. రెండు గంటల విరామం తరువాత మరల 11:55 నిమిషాలకి ప్రరంభామవ్వగానే మరొకసారి 20 % సీలింగ్ చేరుకోవడం తో నేడు మార్కెట్లను పూర్తి గా నిలిపివేశారు. ఈ విధం గా జరగటం దేశ చరిత్ర లో ప్రప్రధమం . సెన్సెక్స్ 2110 పాయింట్లు లాభం పడి 14284 పాయింట్ల వద్ద ముగిసింది/ నిలిపివేశారు .కాగా నిఫ్టీ 651 పాయింట్లు లాభం పడి 4323 పాయింట్ల వద్ద ముగిసింది/ నిలిపివేశారు. నేడు ట్రేడింగ్ కేవలం కొన్ని క్షణాలు మాత్రమె జరగటం తో , నేటి టర్న్ ఓవర్ కేవలం 2900 కోట్లు గా నమోదయ్యింది .నేడు సెన్సెక్స్ లో కేవలం 833 స్టాకులు మాత్రమె ట్రేడ్ అయ్యాయి.
నేడు మార్కెట్లో REALTY రంగం, కాపిటల్ గూడ్స్ రంగం అత్యధికంగా 23.4 % , 21.9 % లాభాలను నమోదు చేసాయి . సెన్సెక్స్ స్టాక్స్ లలో BHEL , L & T అత్యధికంగా 32.7 % , 29.5 % లాభాలను ఆర్జించాయి. నేడు కేవలం 11 స్టాకులు మాత్రమె నష్టాలను నమోదు చేసాయి.
ఇంత అద్భుతం గా మార్కెట్లు లాభపడటం తో నేడు సువర్ణ సోమవారం కింద మనం గుర్తుంచుకోవచ్చు. స్టాక్ మార్కెట్ నిపుణులు కూడా ఎవ్వ్వరు ఊహించని సంఘటనలు ఊహించే కాబోలు మహా కవి శ్రీశ్రీ అలనాడు ఇలా అన్నారు.
నిప్పులు చిమ్ము కుంటూ
నింగికి నే నెగిరి పొతే
నిబిడాశ్చర్యం తో వీరు
నెత్తురు క్రక్కుకుంటూ
నెలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యం గా వీరే .....
ప్రత్యెక editorial గురుంచి " మార్కెట్ ఫోకస్" పేజి ని చుడగలరు...
......