మార్కెట్ నాడి
18-05-2009
దేశం లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామం , రాబోయే ఐదు సంవత్సరాల వరకు వామ పక్షాల మద్దత్తు లేని సుస్థిర ప్రభుత్వం మన మార్కెట్లకు నేడు అమోఘమైన ఉత్సాహం ఇవ్వనున్నాయి. UPA ప్రభుత్వం కి దాదాపు మెజారిటీ సాధించటం వలన చాలా కాలం గా వామ పక్షాల కారణం గా బ్రేక్ పడ్డ సంస్కరనలకి ఇక పచ్చ జండా లభించినట్లే . సంస్కరణలు వేగిరం అయ్యే అవకాశం ఉన్నందున, నేడు మార్కెట్లు ఈ శుభ పరిణామాన్ని కనీసం 2 % గ్యాప్ అప్ తో స్వాగాతించనున్నాయి. బ్యాంకింగ్, పి.ఎస్.యు. రంగాల లో జోరు కనపించబోతున్నది.మధ్యాన్నం వరకు నేడు మార్కెట్లు పెరిగి ఆ తరువాత ప్రపంచ మార్కెట్ల ధోరణి లో చాలా స్వల్పంగా కొంత తగ్గవచ్చు. మా అంచనా ప్రకారం సెన్సెక్స్ నకు సుమారు వెయ్యి పాయింట్లు రాగల రెండు రోజులలో వృద్ధి పొందే అవకాశం ఉంది.
నేడు సెన్సెక్స్ కి కీలక స్థాయిలు
మద్దత్తు స్థాయిలు : 12430-12233-12088
కీలక అవరోధాలు : 12624-12836-12995
........................