మార్కెట్ ముందుచూపు
17-05-2009
(మే 18 ~ 23 వరకు)
ఊహించని విధం గా ఎన్నికల ఫలితాలు సుస్థిర ప్రభుత్వం ఏర్పరిచే విధం గా రావటం మార్కెట్లకు అనుకోని శుభ పరిణామం. . ఇంతవరకు ఆందోళన మధ్య బెరుకు తో పయనం సాగిస్తున్న మార్కెట్ల లో ఇక దూకుడు ధోరణి కనిపించనున్నది. రా బోయే వారం మార్కెట్లు దుర్భేద్యమైన 12430 పాయింట్ల సెన్సెక్స్ అవరోధాన్ని , సోమవారం నాడు అతి సునాయాసం గా చేదిమ్చనున్నది. ఈ ఉత్సాహం మార్కెట్ల ల లో సుమారు రెండు మూడు రోజులు ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన సెన్సెక్స్ వారాంతానికి 13745 పాయింట్ల వరకు చేరే అవకాశం ఉంది. సెన్సెక్స్ నకు 13340 పాయింట్ల వద్ద అవరోధం ఉంది. కొంత దీర్ఘకాలం లో ఆలోచిస్తే సెన్సెక్స్ రాబోయే కొన్ని రోజులలో 14466పాయింట్ల వరకు చేరుకునే అవకాశం ఉంది .ఈ వారం లో మార్కెట్లు పెరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లు ఇప్పటికే తారాస్థాయి చేరుకొని ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లు ఈ వారాంతం లోపల కొంత నష్టపోయే అవకాశం ఉన్నా, మన మార్కెట్లు అంతగా పడిపోయే అవకాశాలు లేవు. ఐతే అడపా , దడపా కొంత ప్రాఫిట్ బూకింగ్ జరిగినా, మరల పుంజుకునే అవకాశాలే ఎక్కువ. ఇంతవరకు మార్కెట్ల పయనం ఎలా ఉంటుందో తేల్చుకోలేని మదుపరులు, విదేశీ సంస్థాగత మదుపరులు మార్కెట్ల కి బలం చేకూర్చనున్నాయి. ఈక్విటీ ఫండ్స్ మార్కెట్లు పడిపోయే అవకాశాలు వున్నాయని ఇది వరకే అమ్మకాలు జరిపాయని వార్త. ఇప్పుడు ఆ ఫండ్స్ నుండి కూడా కొనుగోలు జరగ నున్నాయి. ఐతే ఇవన్ని ఒక్క సారిగా జరుగుతాయని అనుకో రాదు. ముందు గా సెన్సెక్స్ మార్కెట్లు రెండు మూడు రోజులలో సుమారు వెయ్యి పాయింట్ల లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. సెన్సెక్స్ సుమారు 13046 పాయింట్స్ చేరుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా, ఇంతవరకు నిరీక్షించిన ముదుపరులు కొంత పెట్టుపడి పెట్టె అవకాశం ఉంది. మార్కెట్లు రాబోయే రోజులలో మరింత స్థిర మయ్యే అవకాశం ఉంది కనుక సెన్సెక్స్ న కు 11940 పాయింట్ల మద్దతు ని ముఖ్య మైన మద్దతు గా పరిగనించ వచ్చు.
( మరిన్ని మార్కెట్ తాలూకు విశ్లేషణ కై " మార్కెట్ ఫోకస్ " పేజి ని చూడగలరు )
................