మార్కెట్ నాడి
15-05-2009 :: 6 PM
బలమైన ప్రపంచ మార్కెట్లకి నేడు మన మార్కెట్లు కూడా శృతి కలిపాయి. నేడు సెన్సెక్స్ 300 పాయింట్లు లాభ పడి 12173 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ 3671 పాయింట్ల వద్ద ముగిసింది. మన మార్కెట్లు వరుసగా పదవ వారం ఇలా లాభాలలో ముగియటం విశేషం. ఈ వారానికి గాను మార్కెట్లు సుమారు 2.5 % వృద్ధి ని నమోదు చేసింది.
రాజకీయ అనిశ్చిత వాతావరణం లో కూడా మార్కెట్లు ఇటువంటి దుడుకు ధోరణి అవలంబించటం కొంత ఆశ్చర్య కరమని కూడా చెప్పవచ్చు. నేటి మార్కెట్ల లో ఎఫ్. యమ. సి .జి మినహా అన్ని రంగాలు కూడా లాభ పడ్డాయి. బ్యాంకింగ్ మరియు క్యాపిటల్ గూడ్స్ రంగాలు అత్యధికంగా 3.9 % , 3.6 % లాభాలను నమోదు చేసింది.
సెన్సెక్స్ నకు సంబంధించిన షేర్లలో ర్యాన్బాక్సి , ఐ.సి. ఐ. సి. ఐ. బ్యాంకు అత్యధికంగా 8.6 %, 7 % వృద్ధి ని నమోదు చేయగా , ఓ .ఎం. జి. సి, యెన్ .టి. పి. సి. షేర్లు 2.3% , 0.6 % నష్టాలని చవిచూసాయి. ఇతర స్టాక్ ల లో అబన్ ఆఫ్ శౌర్ అత్యధికంగా 22 % లాభపడింది.
......