మార్కెట్ నాడి

15-05-2009 :: 8.00 AM

RBI విడుదల చేసిన GDP సర్వే గణాంకాల కు ప్రతిక్రియ, దేశ రాజకీయాలు, ప్రపంచ మార్కెట్ల ధోరణి మన మార్కెట్ల దశని నిర్దేశించ నున్నాయి.

RBI నిపుణుల చేత జరిపే త్రై మాసిక సర్వే ప్రకారం రాబోయే ఐదు సంవత్సరాలకి గాను దేశ ఆర్ధిక పరిస్థితి గతి కేవలం 7 % మాత్రమె ఉండనున్నదని వెల్లడి చేసింది. గతం లో ఇది 7.7 % గా ఉండింది. ఇది మన దేశ వాణిజ్య పరిస్థి కి శుభ వార్త కాదు.

మన దేశ నాయకులు సుస్థిర ప్రభుత్వాన్ని అందించ గలరన్న విశ్వాసం మార్కెట్లలో రోజు రోజు కి కోరవడుతున్నది. ఇటువంటి అనిశ్చిత వాతావరణం మధ్య, వారాంతం లో traders వారి డబ్బుని మార్కెట్ లో ఉంచే అవకాశం తక్కువ. ఐతే ప్రపంచ మార్కెట్లన్నీ లాభాల బాటలో నడుస్తున్నాయి. కావున మన మార్కెట్లు ఈ పరస్పర విరుద్ధమైన సంకేతాల మధ్య ఒడిదుడుకులతో పయనం సాగించనున్నది. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్ కి నేడు కూడా దూరం గా ఉండటమే మేలు. ఇటువంటి అనిశ్చిత పరిస్థితి లో కొనుగోలు చేయటం సాహసమే అవుతుంది. NDA సుస్థిర ప్రభుత్వం అందించ నున్నదని గత మంగళవారం మార్కెట్లలో ఊపు , నేడు పూర్తిగా నిష్క్రమించే అవకాశం ఉన్నందున మార్కెట్లు నేడు నష్టపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఐతే ఆసియా మార్కెట్లు భారి లాభాలతో పయనిస్తున్నాయి కాబట్టి మార్కెట్లు కొంత లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

నేడు సెన్సెక్స్ కి కీలక స్థాయిలు :

మద్దత్తు స్థాయిలు:

11835-11688-11550

అవరోధాలు :

11940-12100-12235

.....