శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శుభం లాభం
27-04-2009.
తెలుగుభాషాభిమానులకు నమస్సుమాంజలి. మా ప్రథమ సంచిక లో భాగం పంచుకొని మీకు గల మాతృ భాషాభిమానాన్ని మరొక సారి చాటి చెపుతున్న మీకందరికి మా తెలుగు స్టాక్ మార్కెట్. కాం జోహార్లు అర్పిస్తోంది. మన తెలుగు భాషకి ప్రాచిన హోదా కల్పించబడిన శుభ తరుణంలో , మన తెలుగు ఎల్లప్పుడూ నిత్య నూతనం గా విరాజిల్లాలన్న ఆశయం తో , తెలుగు తల్లి కి ఉడతా భక్తీ సేవ గా ఈ వెబ్ పోర్టల్ కి శ్రీకారం చుట్టాము. రాయల యుగం నాటి తెలుగు వాడి వాణిజ్య పటిమా పాటవం మరొక సారి గుర్తు తెచ్చు కొని , నేటికి కూడా మన తెలుగు వారము దేనికి తీసి పోరని , భారత దేశం లోనే BSE , NSE వివరాలు గల ప్రప్రథమ ప్రాంతీయ భాషా స్టాక్ మార్కెట్ వెబ్సైటు గల గౌరవం తెలుగు భాషకే దక్కాలన్నఉద్దేశం తో చేస్తున్న మా కృషిని మీరు మనస్పూర్తి గా ఆహ్వానిస్తారని, ఆనందిస్తారని, ప్రతీ ట్రేడింగ్ రోజు ఇక తెలుగు లో ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాము. తెలుగు లో వెలువడుతున్న ప్ర ప్రధమ బిజినెస్ వెబ్ పోర్టల్ ని మీరు మనస్పూర్తిగా అహ్వానిస్తారని ఆశిస్తూ, మీ అభిమానం , ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాతో ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వెబ్ సైట్ మీకు మరింత ఉపయుక్తం గా వుండే విధం గా తీర్చి దిద్దేందుకు మీ అమూల్యమైన సలహాలు, సూచనలను మాకు తెలియజేయగలరని మేము ప్రార్థిస్తున్నాము. ----- .
మీ www.telugustockmarket.com