మార్కెట్ నాడి
అక్షయ త్రితీయ : 27-04-2009 :.
4:00 PM
మేము సూచించిన విధం గా మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమై 11488 పాయింట్ల పతాక స్థాయి కి చేరుకుంది. ఆ తరువాత మేము ముందుగానే సూచించిన విధం గా 11477 పాయింట్ల వద్ద అమ్మకపు వత్తిడి కి లోనయ్యింది. మా అంచనాలకు నూటి కి నూరు శాతం సరిపోయే విధం గా సెన్సెక్స్ కొంత నష్ట పోయింది. మేము సూచించిన విధం గా మార్కెట్లు కీలక 11391 పాయింట్ల అవరోధాన్ని చేదించే ప్రయత్నం చేసి సరిగ్గా మేము చెప్పిన 11477 పాయింట్ల వద్ద వేడి కోల్పోయి , 11371 పాయింట్ల వద్ద ముగిసింది.
ఈక్విటీ శీర్షిక లో మేము చెప్పిన విధం గా PNB - రూ. 542/- టార్గెట్ ధర ని అందుకోవటం విశేషం. cairn రూ. 194.90 ని చెదించ లేక పోవటం, RCOM రూ. 223/- వద్ద మద్దత్తు తీసుకోవటం కూడా గమనార్హం .
ప్రప్రథమ రోజు నే మా అంచనాలు నూటి కి నూరు శాతం నిజమయ్యాయని సవినయం గా మీకు తెలియ జేస్తున్నాము.
రేపటి మార్కెట్ తీరు తెన్నులు తెలుసుకునేందుకు మరల తప్పక విచ్చేయండి - తెలుగు స్టాక్ మార్కెట్ . కాం -- ----" తెలుగు వాడి స్టాక్ నాడి "

అక్షయ త్రితీయ : 27-04-2009 12:30pm

మా అంచనాలకి అనుగుణంగా మార్కెట్ నష్టాల లో ప్రారంభమై 11443 పాయింట్ల వరకు పయనం సాగించింది.

మేము ముందుగా ఊహించిన విధంగా 11477 పాయింట్ల వద్ద సెన్సెక్స్ కి అవరోధం కలిగి మార్కెట్లు ముందుకు దూసుకుపోలేక పోతున్నాయి.

-తెలుగు స్టాక్ మార్కెట్ . కాం

..

మార్కెట్ నాడి అక్షయ త్రితీయ : 27-04-2009

9:00am

సెన్సెక్స్ నేడు అతి కీలకమైన 11391 పాయింట్లు చేదించేందుకుమరొకసారి గట్టి ప్రయత్నం చేయన్నున్నది. నేడు ఆసియా మార్కెట్లు నష్టాల తో ప్రారంభం అవ్వటం తో , మన మార్కెట్లు లాభాలతో మొదలయ్యే అవకాశం లేదు. మార్కెట్లు లాభ పడాలన్నా 11391 అవరోధాన్ని నిర్ణయాత్మకం గా చేదించటం కీలకం. ఈ కీలక 11391 పాయింట్లు చెదించ లేక పొతే మార్కెట్ నష్టాలలో ముగియనున్నది.

11391 చేదిస్తే సుమారు 11539 పాయింట్ల వరకు సెన్సెక్స్ ఎగబాక వచ్చు. మార్కెట్లు కొన్ని పరిస్తుతులలో పెరిగినా మా అంచనా ప్రకారం నేడు 11477 పాయింట్ల సమీపం లో అమ్మకపు వత్తిడి ని ఎదుర్కొనే పరిస్థితివుంది. అటు తరువాత కొంత నష్ట పోవచ్చు.

సెన్సెక్స్ కి 11391-11477-11539 కీలక అవరోధాలు కాగా 11237-11142-11023 కీలక మద్దత్తు స్థాయిలు .