• 26-2-2010
  • మార్కెట్ నాడి

నేడు ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ ని సుమారు 11 గంటల కి పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపధ్యం లో గత కొన్ని రోజులు గా మార్కెట్ల లో కొనసాగుతున్న ఉత్కంటం నేటి తో ముగియనున్నది. ఈ వారం లో ఇప్పటివరకు అప్రమత్త ధోరణి లో కొనసాగిన మార్కెట్లు ఆర్ధిక మంత్రి ప్రవేశ పెట్టె బడ్జెట్ అంశాలని ఆధారం గా చేసుకుని , తమ దిశని ఖరారు చేసుకోనున్నాయి. బడ్జెట్ సమాచారం మీరు ఎప్పటికప్పుడు మీ TELUGUSTOCKMARKET .COM ద్వారా తెలుసుకో గలరు

నేటి బడ్జెట్ తదనంతరం మార్కెట్లు పెరిగినా , తగ్గినా మదుపరులు కొనుగోళ్ళు ప్రారంభించటం మంచిది. ఉద్దిపణలు వెనుతీసుకుంటే మార్కెట్లు కొంత నిరాశకి గురి అయినా, బడ్జెట్ లోటు ని తగ్గించుకునే ప్రయత్నం , ఆర్ధిక మంత్రి ప్రనాబ్ ముఖేర్జీ చేసినట్లయితే భారత రేటింగ్ ని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ FITCH తెలపటం గమనించ దగ్గ అంశం. భారత దేశ రెటింగ్ పెరిగితే విదేశీ పెట్టుబడులు మరింత గా మన దేశం లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మదుపరులు ప్రధానం గా , ఆర్ధిక మంత్రి బడ్జెట్ లోటు ని ఎంత మేరకు కట్టుదిట్టం చేయనున్నారో గమనించ దగ్గ అంశం . బడ్జెట్ లోటు ని మార్చ్ 2011 నాటికి 5.6% ,లేదా అంతకంటే తక్కువగా మంత్రి ప్రకటిస్తే మదుపరులు కొనుగోళ్ళు ప్రారంభించటం మంచిది . బిడ్జేట్ లోటు తీవ్ర తరం ఐతే ప్రభుత్వానికి , ఇప్పటికే GDP లో 80 % అప్పుభారం తో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థ తో , మరింత కష్టకాలం ఎదురుకోవాల్సి వస్తుంది. 2014 నాటికి లోటు ని 68 % తగ్గించే ప్రయత్నం చేస్తే ,భారత్ అంతర్జాతీయ రేటింగ్ పెరగనున్నది. నిన్నప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మోన్ సింగ్ ఆహువాలియా -వృద్ధి బాట లో పయనిస్తున్న మన దేశ ఆర్ధిక వ్యవస్థ కి మరింత గా రుణ భారం తట్టు కునే శక్తి ఉందని ప్రకటించటం గమనార్హం. బడ్జెట్ లోటు తీవ్రం గా ఉంటె, నేడు బాండ్ మార్కెట్ల లో బాండ్ ఈల్డ్ రేటు పెరిగే అవకాశం ఉంది

ప్రపంచ మార్కెట్ల పరం గా , గత రాత్రి అమెరికా మార్కెట్ల లో పెరిగిన నిరుద్యోగ భత్య గణాంకాల నేపధ్యం లో అక్కడి మార్కెట్లు స్వల్పం గా నష్ట పోయాయి. ఈ కారణం గా నేడు ఆసియా మార్కెట్ల సెంటిమెంట్ కూడా బలహీనం గా ఉంది. ఐతే జపాన్ లో పారిశ్రామిక ఉత్పత్తి అంచనాలను మించి పెరగటం తో నష్టాల నుండి లాభాల లో పయనిస్తోంది.

నేటి ట్రేడింగ్ లో ప్రపంచ మార్కెట్లకి అతీతం గా మన మార్కెట్లు వ్యవహరించ నున్నాయి. నేడు మార్కెట్ ప్రధానం గా కేంద్ర బడ్జెట్ పై దృష్టి నిలపనున్నాయి. ఆహార ఉత్పత్తి ని పెంచటం, ద్రవ్య లోటు ని తగ్గించటం ఈ బడ్జెట్ లో కీలక అంశాలు అయ్యే అవకాశం ఉంది. నేడు ఆహార స్టాకులు ,రిటైల్ రంగం స్టాకులు కొనుగోళ్ళ కి, మోటర్ వాహానాల స్టాకులు , సిమెంట్ స్టాకుల ని అమ్మకాలకై మదుపరులు ఎంచుకుని బడ్జెట్ ప్రస్తావన కి ఎదురు చూడటం మంచిది.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 16254
  • అవరోధాలు: 16340-16486-16527
  • మద్దత్తులు:16252-16191-16124-16064