- 25-2-2010
- మార్కెట్ రిపోర్ట్
ఫిబ్రవరి F & O ముగింపు నేపధ్యం లో చోటు చేసుకున్న షార్ట్ కవెరింగ్ వలన నేడు మరొక సారి మన మార్కెట్లు ఫ్లాట్ గా ముగిసాయి. రేపు విడుదల కానున్న బడ్జెట్ సందర్భం గా ట్రేడేర్లు అప్రమత్త ధోరణి అలవరచు కోవటం తో నేడు మన మార్కెట్లు దిశా హీనంగా పయనించాయి . దీనితో సెన్సెక్స్ 1.77 పాయింట్ల స్వల్ప నష్టాన్ని నమోదు చేసుకుని 16254 పాయింట్ల వద్ద ముగియగా , నిఫ్టీ పాయింట్ల నామ మాత్రపు 1.15 పాయింట్ల లాభం తో 4859.75 పాయింట్ల వద్ద ఫ్లాట్ గా ముగిసింది. ఒక దశ లో 16167 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయిన సెన్సెక్స్ షార్ట్ కవెరింగ్ సహాయం తో నిలదొక్కుకో గలిగింది. ఐతే నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ రంగం ౦.4 % , స్మాల్ క్యాప్ రంగం ౦.18% నష్టపోయాయి .
సేక్టరాల్ సూచీ ల లో నేడు క్యాపిటల్ గూడ్స్ అత్యధికం గా 1.27 % లాభం గడించింది . కాగా ఐ. టి సూచీ 0.55 % లాభపడింది. కాగా చమురు మరియు గ్యాస్ సూచీ అత్యధికం గా 1.05 % నష్టాన్ని మూట గట్టుకోగా, FMCG సూచీ 0.83 % నష్టపోయింది.
నేడు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వే ప్రకారం ఆరోగ్య బీమా , గ్రామీణ బ్యాంకింగ్ ,ఉన్నత విద్య మున్నగు రంగాల లో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి కి అనుమతి ఇవ్వవచ్చని సూచించింది. కాగా GDP వృద్ధి 2010-11 నకు 8.75 % ఉండగలదని అంచనా వేసింది. ఐతే ద్రవ్యోల్బణం, ముఖ్యం గా ఆహార ఉత్పత్తుల ధరల పెరుగుదల విపరీతం గా ఉండగలదని జోస్యం చెప్పింది. కాగా ఉద్దేపణలు క్రేమేపి తొలగించాలని సూచించింది.
నేడు విడుదల అయిన ఫిబ్ర వరి 13 నకు చెందిన ద్రవ్యోల్బణం వరుసగా నాలుగు వారాలు పెరిగి ఈ సారి స్వల్పం గా తగ్గుముఖం పట్టింది. గత వారం తో పోలిస్తే ఇది 17.97 % నుండి 17 .58 % నకు స్వల్ప తగ్గుదలని నమోదు చేసింది.
అదే విధం గా పారిశ్రామిక ఉత్పత్తి గణంకాలని పరిశీలిస్తే , Y-O-Y 2.2 % నుండి 9.4 % వరకు ఎగబాకటం తో నేడు క్యాపిటల్ గూడ్స్ రంగానికి చెందిన స్టాకులు బలపడేందుకు కారణమయ్యింది. పెట్రోలియుం 3.8 %, విద్యుత్ ఉత్పత్తి రంగం 5.6 % మేరకు వృద్ధిని సాధించాయి. సిమెంట్ 12.4 % , స్టీల్ 16.2 % వృద్ధిని నమోదు చేసాయి .
స్టాకుల వారిగా పరిశీలిస్తే, నేడు MPHASIS పేలవమైన Q 4 ఫలితాలు విడుదల చేయటం తో 8 % పై చిలుకు నష్టపోయింది. కాగా చత్తిస్ గడ లో 1600 MW విద్యుత్ ప్లాంటు కాంట్రాక్ట్ దక్కించు కోవడం తో 2.47 % లాభపడింది. 8 ఏప్రిల్ నుండి KOTAK MAHINDRA BANK నిఫ్టీ స్టాకు ల లో గ్రాసిం బదులుగా చోటు దక్కించుకోవడం తో 3.17 % ఎగబాకింది . నేడు అరంగేట్రం చేసిన HATHWAY CABLES 13 % నష్టపోయి మొదటి రోజునే చితికిల పడింది. CADILA HEALTH CARE 1:2 బోనస్ కై బోర్డు ఆమోదం లభించటం తో ఈ కౌంటర్ 1.29 % లాభపడింది.
సెన్సెక్స్ స్టాకు ల లో నేడు LNT అత్యధికం గా 2.47 % , మారుతి 2.37 % లాభపడగా హిందూస్తాన్ యూని లేవేర్ 2.71 % నష్టపోయింది. టాటా మోటర్స్ కూడా 2.69 % కోల్పోయి మార్కెట్ బలహీనత కి కారణమయ్యింది.