- 23-2-2010
- మార్కెట్ రిపోర్ట్
నేడు మన మార్కెట్లు అప్రమత్త ధోరణి లో ట్రేడ్ అయ్యి స్వల్ప లాభాల తో ముగిసాయి. నేటి ట్రేడింగ్ లో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 49 పాయింట్ల లాభాలను ఆర్జించి 16286పాయింట్ల వద్ద ముగిసింది . కాగా నిఫ్టీ 14 పాయింట్ల లాభం పొంది 4870 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు సెన్సెక్స్ 0.30శాతం , నిఫ్టీ 0.28 శాతం లాభపడ్డాయి. ఐతే మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ రంగాలు మాత్రం ౦.59 % , 0.92 % చొప్పున నష్టపోయాయి.
బుధ గురు వారాల లో అమెరికా ఫేడ్ అధ్యక్షులు ,కీలక వడ్డీ రేటు పెంపుదలపై అమెరికా కాంగ్రెస్ ముందు తెలుపబోయే అభిప్రాయం నేపధ్యం లో ప్రపంచ మార్కెట్లను అనుసరించి మన మార్కెట్లు కూడా అప్రమత్తం గా ప్రారంభ మయి ఎటు తేల్చుకోలేక పోయాయి. తదుపరి కొంత మేరకు పుంజుకొని గరిష్టం గా 16325 పాయింట్ల వరకు ఎగబాకింది. ఐతే మధ్యానం తదుపరి తాజా ట్రేడింగ్ లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవటం తో మరల మార్కెట్లు చితికల బడ్డాయి . సెక్టోరల్ సూచీ ల లో నేడు రియాలిటీ 1 % , మెటల్స్ ౦. 7 % లాభాలను ఆర్జించాయి .కాగా ఆటో రంగం 1.8 % , కన్సుమెర్ డ్యుర బుల్స్ 0. 7 % నష్టపోయాయి
నేటి ట్రేడింగ్ సమయం లో రిజర్వు బ్యాంక్ డిప్యు టి గవర్నర్ kc చక్రబర్తి , దుబాయ్ వరల్డ్ తో సుమారు $275 నుండి $ 300 మిలియన్ డాలర్ మేరకు సుమారు 4- 5 భారతీయ బ్యాంకులకు లావాదేవీలు ఉన్నాయని తెలియపరిచారు. ఇది ఇలా ఉండగా US, EU, CHINA దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నస్టైన్ లెస్ స్టీల్ పై , ప్రతీ టన్ను మీద $ 2254 యాంటి డంపింగ్ డ్యూటీ ని విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తో ఆటో మరియు కన్సుమెర్ డ్యురబుల్స్ రంగాలకి చెందిన స్టాకు లు కుదేలుమన్నాయి . NTPC , REC FPO లకు ఆదరణ లభించక పోవటం తో ప్రభుత్వం ఇతర సంస్థలను ఇప్పట్లో లిస్టింగ్ చేసే అవకాశాలు సన్నగిల్లటం తో ప్రభుత్వ రంగ సంస్థల కు చెందిన స్టాకులు నేడు బలహీనపడ్డాయి. కాగా 3G వేలం నకు అడ్డంకులు తోలగటం తో నేడు టెలికాం స్టాకులు లాభ పడ్డాయి. రైల్ బడ్జెట్ ముందుగా రైల్ స్టాకు ల లో ప్రాఫిట్ బుకింగ్ కొనసాగింది. నేడు లిస్టింగ్ జరిగిన ఆక్వా లాజిస్టిక్ 11 % వృద్ధిని నమోదు చేసింది.
సెన్సెక్స్ స్తాకులను పరిశీలిస్తే నేడు సన్ ఫార్మా ,DLF 2.3 % చొప్పున లాభపడ్డాయి .కాగా మారుతి 3.6 % , BPCL 2. 4 % నష్టపోయాయి.