• ౩-11-2009 : 8 : 30 AM
  • మార్కెట్ నాడి

నిన్న మన మార్కెట్లకి సెలవు కనుక నేడు మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల లో గత రెండు రోజులుగా ట్రేడ్ అయిన విధానాన్ని బేరీజు వేసుకొని నేడు తదుపరి పయనం కొనసాగించనున్నాయి. శుక్రవారం నష్టపోయిన అమెరికా మార్కెట్లు , ఫోర్డ్ కంపనీ అంచనాలని మించిన మెరుగైన ఫలితాల దృశ్యా గత రాత్రి లాభాల లో పయనించాయి . కాగా ఆసియా మార్కెట్లు నిన్న మిశ్రమంగా ముగిసాయి.

నేడు , రేపు అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశాల లో ఉద్దేపనల ను ఉపసంహరించే దిశ లో నిర్ణయాలు వేలవడుతాయన్న అంచనాల తో నేడు ఆసియా మార్కెట్లు నష్టాల తో పయనిస్తున్నాయి . ఇప్పటికే చావుదెబ్బ తింటున్న మన మార్కెట్ల కి , ఈ అంశం మరింత ప్రతికూలం గా ప్రభావితం చేయనున్నది.

మన దేశం లో చోటు చేసుకుంటున్న ఇతర అంశాలను పరిశీలిస్తే..... IMF నుండి రిజర్వు బ్యాంక్ 200 టన్నుల బంగారాన్ని కొనుగోళ్ళు చేయనున్నది. క్షీణిస్తున్న అమెరికా డాలర్ విలువ నేపధ్యం లో మన విదేశీ మారక నిలువలను పరిరక్షించుకునే దిశాగా ఈ చర్య అతి ప్రాముఖ్యమైనది. ఈ అంశం వలన రానున్న రోజుల లో డాలర్ విలువ మరింత గా క్షీణించే అవకాశాలు ఉన్నాయి.

అంతర్జాతీయ విపణి లో చెక్కర, బియ్యం ధరలు ఎగబాకుతున్న నేపధ్యం లో మన షుగర్ స్టాకు ల లో సంచలనం కనిపించవచ్చు.

మార్కెట్ల లో గత వారం కనిపించిన బలహీనత నేడు కూడా కనపడవచ్చు.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 15896
  • అవరోధాలు: 15973-16040- 16114-16283
  • మద్దత్తులు:15881-15685-15466