ముందు ముందు చూపు

( అక్టోబర్ 3 నుండి 6 వరకు )

గత వారం అక్టోబర్ మాసపు F & O ముగింపు వలన మార్కెట్లు కొంత వత్తిడికి గురయ్యాయి. రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధానం మార్కెట్లను చావుదెబ్బ తీసాయి. పైగా అంతర్జాతీయ మార్కెట్ల లో బలహీనత చోటు చేసుకోవటం వలన మార్కెట్లు సుమారు 950 పాయింట్ల క్షీణత నమోదు చేసింది. గత వారం అత్యంత కీలక మద్దతు స్థాయిలు వీగిపోవటం తో మార్కెట్ల లో అమ్మకాల వత్తిడి పెరిగిపోయింది. ముఖ్యం గా ఇప్పటివరకు కొనుగోళ్ళు చేస్తున్న విదేశీ సస్తాగత మదుపర్లు , ఇప్పుడు అమ్మకాల వైపు మొగ్గు చూపటం తో మార్కెట్ల లో భల్లుకాల హవా నడిచింది.

గత వారం పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిశీలిస్తే , మును ముందు ఇది మరింత గా పెరిగే సంకేతాలు వెలువడుతున్న దృష్యా, మునుముందు రిజర్వు బ్యాంక్ CRR / SLR మున్నగు అంశాలను పెంచే అవకాశాలు ఉంది. ఈ కారణం వలన మార్కెట్ల లో అమ్మకాల వత్తిడి ఈ వారం కూడా కొనసాగవచ్చు.

అంతర్జాతీయ పోకడలను గమనిస్తే, నేడు, రేపు అమెరికా లో ఫెడరల్ రిజర్వు సమావేశాలు చోటుచేసుకోనున్నాయి. ఈ సమావేశాల లో వడ్డీ రెట్ల పై గాని, ఉద్దేపన ఉపసంహరణ ల పై గాని ప్రకటనలు వెలువడితే మార్కెట్లు మరింతగా బలహీనపడే అవకాశం ఉంది.ముఖ్యం గా ఉత్పత్తి గణాంకాలు అంచనాలని మించి ఉండటం తో అమెరికా మార్కెట్లు గాడిన పడ్డాయని సోమవారం అక్కడి మార్కెట్లు లాభాల తో ముగిసాయి. ఈ అంశం వలన ఫెడరల్ రిజర్వు ప్రకటనలు మరింత ప్రాముఖ్యత చోటుచేసుకోన్నునది.

మన మార్కెట్లను పరిశీలిస్తే, ఈ వారం అక్టోబర్ నెల తాలూకు ఎగుమతుల గణాంకాలు విడుదల కానున్నాయి ఈ అంశం ఆశాజనకం గా ఉంటే మార్కెట్లు కొంత అమ్మకాల వత్తిడిని తట్టుకునే అవకాశం ఉంది. అంబాని సోదరుల వివాదం కూడా మార్కెట్ ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

టెక్నికల్ గా సెన్సెక్స్ అత్యంత కీలక మద్దత్తు స్థాయి అయిన 15973 పాయింట్ల ను కోల్పోవటం తో మార్కెట్లు మరింత గా దిద్దుబాటు కి గురి అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లు 75 DMA వద్ద ముగిసింది. కాగా 100DMA 15466 పాయింట్ల మద్దత్తు స్థాయి సెన్సెక్స్ నకు నిర్ణయాత్మకం . ఇది వీగిపోతే 15012 , ఆ తరువాత 14630 పాయింట్ల స్థాయి కీలకం. కాగా 16002, 16283 ,16494 వద్ద ముఖ్యమైన అవరోధాలు ఉన్నాయి.

ఈ వారం మిడ్ క్యాప్ , స్మాల్ క్యాప్ స్టాకులు అతి తీవ్ర మైన అమ్మకాల వత్తిడి కి గురి అయ్యే సూచనలు ఉన్నాయి. కాగా గత వారం తీవ్రం గా కోల్పోయిన టెలికాం, బ్యాంకింగ్ స్టాకు ల లో కొంత కొనుగోళ్ళు కనిపించే అవకాశం ఉంది. దీర్ఘ కాల మదుపర్లు పైన తెలిపిన కీలక 15012- 14630 మద్దత్తు స్థాయిల వద్ద స్వల్పం గా కొనుగోళ్ళు చేయవచ్చు. ఈ మద్దతులు కూడా వీగిపోయి మార్కెట్లు మరింత గా దిద్దుబాటు కి గురైతే , అప్పుడు తక్కువస్థాయి ల లో మరింత కొనుగోళ్ళు చేయవచ్చు.