- 28-10-2009:: 7 pm
- మార్కెట్ రిపోర్ట్
స్టాక్ మార్కెట్ వరుసగా మూడో రోజు నష్టాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 70 పాయింట్లు కోల్పోయి 16,283 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయి 4,826 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 0.43 శాతం, నిఫ్టీ 0.42 శాతం మేరకు క్షీణించాయి.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధానం రుచించకపోవడంతో నిన్నటి స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వాటిని కొనసాగిస్తూ.. మూడో రోజు వరుసగా స్టాక్ మార్కెట్ ఫ్లాట్ నోట్‌తో 16,336 వద్ద ప్రారంభమైంది. ప్రారంభమైన ఒక గంట ట్రేడ్‌లోనే సెన్సెక్స్ బాగా క్షీణించి కనిష్ఠ స్థాయిలను నమోదు చేసింది.ఈ ప్రక్రియలో.. 16,144 వద్ద కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా సెన్సెక్స్ తిరిగి పుంజుకోవడం ప్రారంభించింది. కొంత రికవరీ అయింది. ఈ ప్రక్రియలో కనిష్ఠ స్థాయి నుంచి 267 పాయింట్లు లాభపడి 16,411 వద్దకు గరిష్ఠంగా చేరుకుంది. అయితే ఆ రికవరీ ఎంతో సేపు నిలబడలేదు.ఆర్‌బీఐ చేసిన తాజా ద్రవ్యపరపతి విధానంతో... త్వరలోనే ప్రభుత్వం ఉద్ధీపనలను తగ్గించనున్నట్లు ఆందోళనలు మార్కెట్ పతనానికి నాంది పలకగా.. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూలతలు మరింత క్షీణతకు ఆజ్యం పోశాయి. అలాగే ద్రవ్యోల్బణానికి సంబంధించి చేసిన భవిష్యత్ అంచనాలు సైతం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. ఈ ప్రక్రియ లో మేము ఉదయం సూచించిన 16252 పాయింట్ల కీలక మద్దత్తు సమీపం లో మార్కెట్లు కొట్టుమిట్టాడి చివరికి 16283 పాయింట్ల వద్ద ముగిసింది.