• Watch out for AGRI stocks. అగ్రి స్టాకు ల పట్ల మదుపరులు ద్రుష్టి నిలుపగలరు కారణం :
వ్యవసాయరంగంలో కార్పొరేటీకరణ వైపు ప్రభుత్వం వేగంగా అడుగులేస్తోంది. ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే ఇందుకు నిదర్శనం. ప్రయివేటు పెట్టుబడులు తగ్గుతుండటం వల్లే వ్యవసాయ రంగంలో అభివృద్ధి పడిపోతోందని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రయివేటు రంగానికి సరసమైన వడ్డీకి పరపతి సౌకర్యం లభించేలా చూడాలని సర్వే సూచించింది. అయితే కేంద్ర గణాంకాల సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరిగినప్పటికీ, ప్రభుత్వ పెట్టుబడులు 20.9 నుండి 17.6 శాతానికి తగ్గాయని తెలిపింది